ఈ-సెక్యూరిటీలో చైనా కంటే ఇండియానే బెటర్‌.. సర్వేలో సంచలన విషయాలు | surfshark survey India esecurity better than China | Sakshi
Sakshi News home page

surfshark survey: ఈ-సెక్యూరిటీలో చైనా కంటే ఇండియానే బెటర్‌

Published Sun, Sep 26 2021 11:23 AM | Last Updated on Sun, Sep 26 2021 11:49 AM

surfshark survey India esecurity better than China - Sakshi

ఒకటి గుడ్‌ న్యూస్‌, మరొకటి బ్యాడ్‌ న్యూస్‌. ఇంటర్నెట్‌ స్పీడులో భారత్‌ వెనుకంజలో ఉంటే..ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ విషయంలో దక్షిణాసియా చెందిన 8 దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. వరల్డ్‌ వైడ్‌గా చైనా కంటే భారత్‌ మెరుగ్గా ఉంది.

యూకేకి చెందిన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వీస్‌ (వీపీఎన్‌) 'సర్ఫ్‌షార్క్' సంస్థ ప్రపంచ దేశాల్లో సర్వే నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా 110 దేశాల్లో 6.9 బిలియన్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లని సర్వే చేసింది. ఇంటర్నెట్‌ ఆఫార్డబులిటీ, ఇంటర్నెట్‌ క్వాలిటీ, ఎలక్ట్రానిక్‌ ఇన్ఫ్రాస్ట్రెక్చర్‌, ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్‌ గవర్నమెంట్‌ల పనితీరు వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించింది. ఇందులో 'డిజిటల్‌ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ఇండెక్స్‌ 2021'(డీక్యూఎల్‌)లో భారత్‌ 59వ స్థానం దక్కించుకుంది.  గతేడాదికంటే రెండు స్థానాలు తగ్గాయి. మొత్తం 110 దేశాలకు ర్యాకింగ్‌ ఇచ్చారు. 

అదే విధంగా ఈ సర్వేలో పలు విభాగాలకు కేటాయించిన ర్యాంకుల్లో ఎలక్ట్రానిక్‌ గవర్నమెంట్‌ 33వ ర్యాంక్‌, ఎలక్ట్రానిక్‌  సెక్యూరిటీ 36వ ర్యాంక్‌, ఇంటర్నెట్ అఫార్డబులిటీ 47వ ర్యాంక్‌, ఎలక్ట్రానిక్‌ ఇన్ఫ్రాస్ట్రెచ్చర్‌ 91వ ర్యాంక్‌లు దక్కాయి. ఇంటర్నెట్‌ క్వాలిటీ, స్పీడ్‌ విషయంలో 67వ ర్యాంక్‌  సాధించగా.. ప్రపంచంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ (12.33 ఎంబీపీఎస్‌) తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది.     

చైనా కన్నా మనమే బెటర్‌ 
మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ విషయంలో భారత్‌ వెనుకంజలో ఉన్నా ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ విషయంలో చైనా కంటే ముందజలో ఉంది. టెక్నాలజీ విషయంలో ప్రపంచంలో తమకు మించిన దేశం మరొకటి లేదని చైనా ప్రచారం చేసుకుంటున్నా..భద్రత విషయంలో మిగిలిన దేశాల ఎదుట పరువు పొగొట్టుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ-సెక్యూరిటీలో విభాగంలో భారత్‌ గతే డాదికంటే ఈ ఏడాది 76శాతం మెరుగైన ఫలితాల్ని రాబట్టి 36 వ ర్యాంక్‌ను సాధించి చైనాను వెనక్కి నెట్టింది.  ఏసియా స్థాయిలో 17వ స్థానం..దక్షిణ ఆసియా దేశాల్లో  ప్రథమ స్థానంలో ఇండియా ఉంది. 

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ 95వ స్థానంలో ఉండగా.. ఇంటర్నెట్ సామర్ధ్యం గతేడాది కంటే ఈ ఏడాది 75 శాతం తగ్గి 47వ ర్యాంక్‌ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌తో పోలిస్తే, మన దేశంలో ఇ-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తక్కువగా ఉంది. ఇంటర్నెట్ ధర, ఇంటర్నెట్ సామర్ధ్యం, ఇ-సెక్యూరిటీ, ఇ-గవర్నమెంట్‌లో మాత్రం ఎక్కుగా ఉంది.  

అగ్రస్థానంలో డెన్మార్క్
డీక్యూఎల్‌ సర్వేలో అత్యధిక ర్యాంకులు సాధించిన 10 దేశాలలో ఐరోపాకి చెందిన 6 దేశాలున్నాయి. మొత్తం 110 దేశాల సర్వేలో మొదటి ఐదు స్థానాల్లో  డెన్మార్క్ వరుసగా రెండో సారి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. దక్షిణ కొరియా 2వ స్థానం, ఫిన్లాండ్ 3 వ స్థానం, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఉన్నాయి. దిగువన ఇథియోపియా, కంబోడియా, కామెరూన్, గ్వాటెమాల ,అంగోలా ఐదు దేశాలు ఉన్నాయి. 

చదవండి: చైనా మూర్ఖపు నిర్ణయంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement