మెటల్స్‌ మెరుపులు- సెన్సెక్స్‌ రికార్డ్‌ | Sensex @ 48000 mark- Markets hits new highs | Sakshi
Sakshi News home page

మెటల్స్‌ మెరుపులు- సెన్సెక్స్‌ రికార్డ్‌

Published Mon, Jan 4 2021 3:53 PM | Last Updated on Mon, Jan 4 2021 4:06 PM

Sensex @ 48000 mark- Markets hits new highs - Sakshi

ముంబై, సాక్షి: దేశీయంగా కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి 9వ రోజూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 308 పాయింట్లు ఎగసి 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్లు జమ చేసుకుని 14,133 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,220 వద్ద, నిఫ్టీ 14,148 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! (స్ట్ర్రెయిన్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి హైజంప్‌)

పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్ 5 శాతం‌, ఐటీ 2.7 శాతం, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, మీడియా సైతం 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, హిందాల్కో, ఐషర్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, బీసీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌, గ్రాసిమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌ మహీంద్రా టాటా మోటార్స్‌ 8.4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హీరోమోటో, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌,  టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6- 0.5 శాతం మధ్య నీరసించాయి.

మెటల్‌ జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో చోళమండలం, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, నాల్కో, వేదాంతా, ఎన్‌ఎండీసీ, ఐడియా, కమిన్స్‌, అశోక్‌ లేలాండ్, భెల్‌ 7-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు జీ, జూబిలెంట్‌ ఫుడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బంధన్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ 2.6-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,096 లాభపడగా.. 993 మాత్రమే నష్టాలతో ముగిశాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement