Galaxy Unpacked 2023: Samsung Launches New Watch 6 Series In India; Key Highlights Here - Sakshi
Sakshi News home page

'ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్‌ గెలాక్సీ  వాచ్‌ 6...యాపిల్‌కు షాకే!

Published Thu, Jul 27 2023 12:55 PM | Last Updated on Thu, Jul 27 2023 1:54 PM

Samsung Galaxy Watch 6 launched in India key highlights here - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌  కొత్త గెలాక్సీ  స్మార్ట​్‌వాచ్‌లను లాంచ్‌ చేసింది. బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో  గెలాక్సీ వాచ్‌ 6, గెలాక్సీ వాచ్‌ 6,  క్లాసిక్‌ పేరుతో రెండు వేరియంట్‌లను బుధవారం  తీసుకొచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఇష్టమైన ఫీచర్, ఫిజికల్ రొటేటింగ్  బెజెల్‌ను తీరిగి  పరిచయం చేసింది.  ఈ సిరీస్‌లో  AFib లేదా క్రమరహిత హృదయ స్పందన రేటు ట్రాకింగ్‌, ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్‌, ఫాల్‌డిటెక్షన్‌,   గూగుల్‌  వాయిస్‌ అసిస్టెంట్‌,  స్లీప్‌ ట్రాకింగ్‌, పీరియడ్‌ ట్రాకింగ్‌ లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి.  (శాంసంగ్‌ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్‌..అదిరిపోయే ఆఫర్‌తో...)

అలాగే దేశంలో తొలిసారిగా  గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 'ట్యాప్ & పే' ఫీచర్‌తో వీటిని లాంచ్‌ చేసింది. అంటే యూజర్లు, చేతికి వాచ్‌ ఉండగానే  ప్రయాణంలో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుందని  కంపెనీ లాంచింగ్‌ సందర్భంగా ప్రకటించింది. (యాపిల్‌ ఐఫోన్‌ 14 పై భారీ డిస్కౌంట్‌)

వీటి కోసం ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. శాంసంగ్‌  గెలాక్సీ  వాచ్‌ 6  44ఎంఎ గ్రాఫైట్ , సిల్వర్‌లో , 40ఎంఎం గ్రాఫైట్,గోల్డ్‌ కలర్స్‌లో లభ్యం.300mAh , 400mAh బ్యాటరీలను ఇందులో అందించింది. ప్రీమియం, టైమ్‌లెస్ టైమ్‌పీస్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ బ్లాక్‌ అండ్‌ సిల్వర్‌ ,  43ఎంఎ,  47ఎంఎం మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. AOD ఫీచర్ ఆన్‌తో 30 గంటల బ్యాటరీ  లైఫ్‌ని,  AOD ఫీచర్ ఆఫ్‌తో 40 గంటల వరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది.

శాంసంగ్‌  గెలాక్సీ  వాచ్‌ 6  ధర రూ. 29,999 నుండి ప్రారంభం.   44ఎంఎ డయల్, LTE  సపోర్ట్‌ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 36,999. శాంసంగ్‌  గెలాక్సీ వాచ్‌ 6  క్లాసిక్‌ 43 ఎంఎం మోడల్ ధర రూ.36,999. LTT, 47 ఎంఎం మోడల్ ధర రూ.43,999గా నిర్ణయించింది. 

వినియోగదారులు శాంసంగ్‌  ఆన్‌లైన్ స్టోర్ నుండి జూలై 27 నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 11న సేల్స్‌ మొదలవుతాయి. ప్రీ-బుక్ చేసుకున్న వారు రూ.19,999తో ప్రారంభమయ్యే సరికొత్త గెలాక్సీ  వాచ్‌ 6  సిరీస్‌ని సొంతం చేసుకోవచ్చు.  దీంతోపాటు శాంసంగ్‌  గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement