రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్‌ డివిడెండ్‌ RBI To Pay Record Dividend Rs 2 1 Lakh Crore To Government For FY24 | Sakshi
Sakshi News home page

రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్‌ డివిడెండ్‌

Published Wed, May 22 2024 5:11 PM | Last Updated on Wed, May 22 2024 5:15 PM

RBI To Pay Record Dividend Rs 2 1 Lakh Crore To Government For FY24

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ. 2.1 లక్షల కోట్లను అత్యధిక మిగులును చెల్లించనుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.87,420 కోట్లతో పోలిస్తే ఈసారి రెండితలు కన్నా అధికం. రికార్డ్ మొత్తంలో ఆర్బీఐ చెల్లించనున్న డివిడెండ్ ప్రభుత్వం తన బడ్జెట్ లోటు లక్ష్యమైన 5.1 శాతం జీడీపీని చేరుకోవడంలో సహాయపడుతుంది.

ఆర్బీఐ చెల్లించనున్న డివిడెంట్‌తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చనుంది. దీంతో ప్రభుత్వం వివిధ అంశాలల్లో గణనీయమైన ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం  కలగనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే రుసుము, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం నుంచి ఆర్బీఐ ఏటా డివిడెండ్‌ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement