Digital Payments: నెట్​ లేకున్నా పేమెంట్​ ఎలా చేస్తారో తెలుసా? | RBI Gives Nod For Offline Retail Digital Payments Very Soon | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ ప్రయోగం సక్సెస్​.. ఆఫ్​లైన్​ మోడ్​లోనూ డిజిటల్‌ చెల్లింపులు. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి!

Published Thu, Oct 14 2021 9:22 AM | Last Updated on Thu, Oct 14 2021 10:14 AM

RBI Gives Nod For Offline Retail Digital Payments Very Soon - Sakshi

టీ కొట్టు, హోటల్​, రెస్టారెంట్​, కిరాణ షాప్​, మార్ట్​లు, మెడికల్​ షాప్, దుస్తుల షోరూం, క్యాబ్​లు​ ఇలా  ఏ సేవల్ని ఉపయోగించుకున్నా .. పది రూపాయలలోపు నుంచి వేల రూపాయల దాకా డిజిటల్​ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నాం. ఇక కార్డుల స్వైపింగ్​ సంగతి సరేసరి. ఇంటర్నెట్​ లేదంటే వైఫై సౌకర్యం ద్వారా ఈ చెల్లింపులు చేస్తున్నాం కదా. క్యాష్​లెస్​ ట్రాన్​జాక్షన్స్​ను ప్రొత్సహించడం కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రణాళికే ఇదంతా. మరి అసలు ఇంటర్నెట్​తో సంబంధం లేకుండా డిజిటల్​ చెల్లింపులు జరిపితే ఎలా ఉంటుంది!?


ఇంటర్నెట్‌ లేకున్నా, ఆఫ్‌లైన్‌ ద్వారానే డిజిటల్‌ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మొదలుపెట్టింది.  2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఆఫ్​లైన్​ రిటైల్​ డిజిటల్​ పేమెంట్​ పద్దతిని అమలు చేసి పరిశీలించింది కూడా. ఈ ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలు షురూ చేసింది. 



చెల్లింపులు ఎలాగంటే..

ఆఫ్‌లైన్‌ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రత్యేక కార్డు లేదంటే టోకెన్లు ఇస్తాయి. ఒకరకంగా ఇవి డెబిట్‌ కార్డులాంటివే. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా చెల్లింపును పూర్తి చేయొచ్చు. మామూలుగా అయితే పీవోఎస్‌ యంత్రానికీ నెట్‌ అవసరం. కానీ, ఈ ప్రత్యేక పీవోఎస్‌ మెషిన్‌కు చెల్లింపుల టైంలో ఇంటర్నెట్‌తో పని లేదు. ఓటీపీ లేదంటే ఎస్​ఎంఎస్​ కన్ఫర్మేషన్​ ద్వారా చెల్లింపు చేయొచ్చు. కాకపోతే ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్‌ అవుతాయి. అంతేకాదు.. వాయిస్‌ బేస్డ్‌ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్‌ ద్వారా సూచనలు ఇచ్చి కూడా చెల్లింపులను పూర్తి చేయొచ్చు. అయితే వాలెట్లు, కార్డులు, మొబైల్​ డివైస్​లు, యూపీఐ పేమెంట్స్​(ఫోన్​ పే, గూగుల్​ పే..)తోనూ ఈ తరహా  చెల్లింపులు సాధ్యమవుతుందని చెప్తున్నారు క్యాష్​ప్రీ పేమెంట్స్​ కో ఫౌండర్​ రీజు దత్తా.

అసలు కారణం..
నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోతే డిజిటల్‌ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ఆఫ్​లైన్​ విధానం తీసుకురాబోతున్నారు.

వాళ్లను దృష్టిలో పెట్టుకునే.. 
ఆన్​లైన్​ డిజిటల్​ చెల్లింపుల ప్రక్రియ.. గ్రామీణ ప్రాంతాల్లో, నిరక్షరాస్యులకు, వయసు పైబడిన వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ ఆఫ్​లైన్​ చెల్లింపుల ప్రక్రియ ద్వారా వాళ్లకు ఊరట లభించనుంది. అంతేకాదు ఫిన్​టెక్​ సంస్థలకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేయడంతో పాటు, యంత్రాలను తయారు చేయడం, వాటిని ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండని గ్రామీణ ప్రాంతాలకు.. కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో అందించేందుకు వీలు ఉంటుంది. ఎన్‌ఎఫ్‌సీ (నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఫిన్‌టెక్‌ సంస్థలకు సరికొత్త వ్యాపారావకాశాలను సృష్టించే వీలుంది.

జాగ్రత్త అవసరమే..
ఆన్​లైన్​ పేమెంట్స్​ వల్ల సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆఫ్‌లైన్‌ కార్డులతో ఆ రిస్క్​ తక్కువ. అయినప్పటికీ మరింత అప్రమత్తత అవసరమని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. అయితే, చెల్లింపులకు జియోట్యాగింగ్‌ చేయడంలాంటి వాటివల్ల వీటికి అడ్డుకట్ట వేసే వీలుందని అంటున్నారు.

సాధ్యమేనా?
ఇదేం కొత్త విధానం కాదు. ఇంటర్నెట్‌ అవసరం లేకుండా నగదు బదిలీ సేవలు దాదాపు దశాబ్దం కిందే ఉండేవి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్మార్ట్ ఫోన్లు అంతగా వాడకంలో లేనిటైంలో అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీసెస్‌ డేటా (యూఎస్‌ఎస్‌డీ)తో పనిచేసే *99H కు ఫోన్‌ చేయడం ద్వారా, సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్‌ఎంఎస్‌) బ్యాంకు లావాదేవీలను నిర్వహించే వీలును తీసుకొచ్చింది. యూఎస్‌ఎస్‌డీ ద్వారా బ్యాంకు ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ చేయడం నిర్వహించుకోవచ్చు. ఇందుకు నెట్‌ అవసరం లేదు. కాబట్టి, ఆఫ్‌లైన్‌లో నగదు చెల్లింపు లావాదేవీలు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నమొత్తం చెల్లింపులను సులభంగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు.


2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆర్బీఐ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఆఫ్​లైన్​ డిజిటల్​ పేమెంట్​ ఇన్షియేటివ్​లో మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ జరిగింది.

చదవండి: కార్డు చెల్లింపులు.. కొత్త రూల్స్‌ గుర్తున్నాయా?.. ఇవే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement