World Top 100 Billionaires: RadhaKishan Damani Entered In The World Top Hundred Billionaires - Sakshi
Sakshi News home page

World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్‌లో మరో భారతీయుడు

Published Thu, Aug 19 2021 2:11 PM | Last Updated on Thu, Aug 19 2021 3:31 PM

RadhaKishan Damani Entered In The World Top Hundred Billionaires - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అ‍త్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 

97వ స్థానం
ఇండియల్‌ బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్‌ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్‌ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకటించింది.

డీమార్ట్‌ నుంచే
రాధాకిషన్‌ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్‌. దమానీ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న డిమార్ట్‌ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో రాధాకిషన్‌ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు.  డీమార్ట్‌ షేర్‌ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్‌ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది.

మిగిలినవి
దమానీ సంపదలో డీమార్ట్‌ తర్వాత సుందర్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్‌గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్‌ హెల్త్‌కేర్‌ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. 

చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్‌ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement