అదానీ కంపెనీల్లో బీమా సంస్థలకు ఎక్స్‌పోజర్‌ Public Sector General Insurers Have Exposure Of Rs 347. 64 cr | Sakshi
Sakshi News home page

అదానీ కంపెనీల్లో బీమా సంస్థలకు ఎక్స్‌పోజర్‌

Published Tue, Feb 14 2023 3:59 AM | Last Updated on Tue, Feb 14 2023 3:59 AM

Public Sector General Insurers Have Exposure Of Rs 347. 64 cr - Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల్లో ప్రభుత్వరంగ ఐదు సాధారణ బీమా సంస్థలకు రూ.347 కోట్ల ఎక్స్‌పోజర్‌ (రుణాలు, పెట్టుబడులు) ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కరాడ్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల వివరాలపై సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. బ్యాంకులు సమర్పించిన రుణాల సమాచారాన్ని వెల్లడించరాదని ఆర్‌బీఐ చట్టం చెబుతున్నట్టు సహాయ మంత్రి తెలిపారు.

ఎల్‌ఐసీ జనవరి 30 నాటికి అదానీ గ్రూపు కంపెనీల్లో ఈక్విటీ వాటాలు, డెట్‌ కలిపి రూ.35,917 కోట్ల ఎక్స్‌పోజర్‌ కలిగి ఉందని, సంస్థ మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.41.66 లక్షల కోట్లలో ఇది కేవలం 0.975 శాతానికి సమానమని పేర్కొన్నారు. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్‌ ఇన్సూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు అదానీ గ్రూపు కంపెనీల్లో జనవరి చివరికి రూ.347.64 కోట్ల ఎక్స్‌పోజర్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement