PepsiCo Announces Layoffs Of Hundreds Of Corporate Jobs In Its New York Headquarters - Sakshi
Sakshi News home page

PepsiCo Layoffs 2022: కార్పొరేట్‌ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!

Published Tue, Dec 6 2022 12:47 PM | Last Updated on Tue, Dec 6 2022 1:31 PM

PepsiCo to layoffs hundreds of corporate jobs - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు దిగ్గజ సంస్థల్లో కొనసాగుతోంది. తాజాగా  ఈ బాటలో మరో గ్లోబల్‌సంస్థ పెప్సీకో నిలిచింది.  స్నాక్స్‌ అండ్‌  శీతల పానీయల కంపెనీ వందలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదించింది.ఉత్తర అమెరికాలో వందలాది కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తోందని తెలిపింది. 

 ఈ వార్తలతో అంతర్జాతీయ దిగ్గజసంస్థ పెప్సీకో తన కంపెనీ ఉద్యోగుల్లు గుండెల్లో  బాంబు పేలింది. పెప్సికో  పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో  ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారు.  వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే  స్నాక్స్ యూనిట్లో  ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదిక తెలిపింది. అయితే ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. (లేఆఫ్స్ బాంబు: టాప్‌ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!)

కాగా  ప్రపంచం ఆర్థికమాంద్యం ముప్పు భయాలతో పలు దిగ్గజ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. దీనికి తోడు ఆదాయాలు పడిపోతూ ఉండటంతో నిర్వహణ  ఖర్చులను  తగ్గించుకునే క్రమంలో ఇప్పటికే  పలు టెక్,  మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఆపిల్, మెటా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్, కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి.   (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement