OYO introduces Stay Now, Pay Later feature; Check how it works - Sakshi
Sakshi News home page

సూపర్‌ ఆఫర్‌.. డబ్బులు లేకుండా ఓయో రూమ్‌! 

Published Wed, Jun 14 2023 6:47 PM | Last Updated on Wed, Jun 14 2023 7:05 PM

OYO introduces Stay Now Pay Later feature - Sakshi

హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.  స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్‌ ఆఫర్లను అందిస్తుంటాయి. 

ఆఫర్‌ వివరాలు
SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఓయో యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్‌ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.  త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్‌ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో,  చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు.

Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది.  అయితే Simpl యాప్‌లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది.

ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement