నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్‌ | Ola Electric Bike Taxi Operations That Will Help Drivers Earn Up To 70k Per Month, Know In Details - Sakshi
Sakshi News home page

Ola Electric Bike-Taxi Service: నెలకు రూ. 70వేలు సంపాదించుకునే అవకాశం.. ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ బంపరాఫర్‌

Published Sat, Oct 21 2023 1:20 PM | Last Updated on Sat, Oct 21 2023 3:29 PM

Ola Electric Bike Taxi Operations That Will Help Drivers Earn Up To 70k Per Month - Sakshi

ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. 

బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్‌1 బైక్‌ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. రైడ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు.    

డబ్బులు ఎలా సంపాదించాలి?
రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్‌ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్‌ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్‌ విడుదల చేసిన ఓ పాంప్లెట్‌లో పేర్కొన్నారు. 

ఓలా విడుదల చేసిన పాంప్లెట్‌లో ఏముందంటే?
బెంగళూరులోని బైక్‌ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్‌ వరకు ఫిక్స్‌డ్‌ పేమెంట్‌ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్‌ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్‌ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్‌ అమౌంట్‌ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్‌ల కోసం డ్రైవర్‌లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా  రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు.

వాళ్లు మాత్రం అనర్హులే
అదే సమయంలో, డ్రైవర్‌లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది.

తక్కువలో తక్కువగా
నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్‌ 10 రైడ్‌లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్‌లో హైలెట్‌ చేసింది.

చదవండి👉 ఓలాకు భారీ షాక్‌, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్‌ అగర్వాల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement