క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే.. New Features Will Be Introduced For Rupay Cards | Sakshi
Sakshi News home page

రూపే ‍క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే..

Published Mon, Apr 8 2024 7:37 AM | Last Updated on Mon, Apr 8 2024 12:27 PM

New Features Will Be Introduced For Rupay Cards - Sakshi

రూపే క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈమేరకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి వీటిని త్వరలో అమలు చేయబోతున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. 

రూపే క్రిడిట్‌ కార్డును వినియోగించి యూపీఐ లావాదేవీలు జురుపుతుంటారు. అయితే సంబంధిత యూపీఐ యాప్‌లోనే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. క్రెడిట్‌ అకౌంట్‌ బిల్‌ పేమెంట్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ పేమెంట్‌ ఆప్షన్‌, లిమిట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందిస్తున్న బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అమలులోకి తీసుకురావాలని ఎన్‌పీసీఐ తెలిపింది.

ఇప్పటికే రూపే క్రెడిట్‌ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్‌ చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్‌ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్‌ చేసిన యూపీఐ యాప్‌లోనే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఈఎంఐ రేట్లకు సంబంధించిన జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. 

ఇదీ చదవండి: త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌.. ఎందుకంటే..

క్రెడిట్‌ అకౌంట్‌ బిల్‌పేమెంట్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ పేమెంట్‌ ఫీచర్‌ ద్వారా యూపీఐ యాప్‌లోనే కార్డు బిల్లు చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్‌ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్‌ లిమిట్‌ పెంచమని బ్యాంక్‌ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరే వెసులుబాటు ఉండనుంది. క్రెడిట్‌ కార్డు ఔట్‌ స్టాండింగ్‌ బిల్‌, మినమిమ్‌ బిల్‌, టోటల్‌ అమౌంట్‌, బిల్‌ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement