Nandan Nilekani Donates Rs 315 Crore To Alma Mater IIT-Bombay - Sakshi
Sakshi News home page

50 ఏళ్ల అనుబంధం: నందన్‌ నీలేకని కీలక నిర్ణయం

Published Tue, Jun 20 2023 1:16 PM | Last Updated on Tue, Jun 20 2023 1:35 PM

Nandan Nilekani Donates Rs 315 Crore To Alma Mater IIT Bombay - Sakshi

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్‌ నందన్ నీలేకని మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తను చదువుతున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకి భారీ విరాళానని ప్రకటించారు. తన 50 సంవత్సరాల అనుబంధాన్ని పురస్కరించుకుని  రూ. 315 కోట్లను విరాళంగా ఇచ్చారు. (సుందర్‌ పిచాయ్‌: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?)

నందన్‌ నీలేకని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి ఒక అవగాహన ఒప్పందంపై మంగళవారం అధికారికంగా సంతకాలు చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి  ఐఐటీ బాంబేలోని టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.

ఐఐటీ  బాంబేతో తన  జీవితంలో ఒక మూలస్తంభంలాంటిది. ఇవాల్టి తన ప్రయాణానికి పునాది వేసిందని నీలేకని పేర్కొన్నారు.  తన విజయానికి బాటలు వేసిన ఇలాంటి గౌరవప్రదమైన సంస్థతో 50 ఏళ్ల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థకు సాయం చేయడం సంతోషంగా ఉందని నీలేకని పేర్కొన్నిరు. ఇది కేవలం డబ్బు సాయం మాత్రం కాదు.. తన జీవితానికి చాలా అందించిన  గొప్ప ప్రదేశం పట్ల తనకున్న గౌరవం, అలాగే  రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల ఇది తన నిబద్ధత  అన్నారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్‌, ఇంకా విశేషాలు)

ఐఐటీ  బాంబేతో అనుబంధం
నీలేకని 1973లో  ఐఐటీ బాంబేలోఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ  చేశారు. గతంలో  కూడా ఇదే ఇన్‌స్టిట్యూట్‌కి  85 కోట్లు అందించారు. దీంతో   మొత్తం సహకారం రూ. 400 కోట్లకు చేరుకుంది. 1999 - 2009 వరకు ఐఐటీ  బాంబే హెరిటేజ్ ఫౌండేషన్  బోర్డులో పనిచేశారు. 2005-2011 వరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఉన్నారు. 1999లో ప్రతిష్టాత్మకమైన విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును, 2019లో  ఐఐటీ బాంబే 57వ కాన్వకేషన్‌లో భాగంగా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు నందన్‌ నీలేకని.  (మరిన్ని బిజినెస్‌వార్తలు,  ఆసక్తికర కథనాల కోసం  చదవండి సాక్షిబిజినెస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement