Motorola: Launched 5G Phone Moto G 51 In India Detail In Telugu - Sakshi
Sakshi News home page

5జీ మొబైల్స్.. ఈ ఫీచర్స్‌తో ఈ మోడలే చాలా చీప్‌ అంట!

Published Tue, Dec 14 2021 3:51 PM | Last Updated on Tue, Dec 14 2021 4:42 PM

Motorola Launched 5G Phone Moto G 51 In India  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ బ్రాండ్‌ మోటరోలా తాజాగా మోటో జీ51 5జీ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ధర రూ.14,999 ఉంది. 12 రకాల 5జీ బ్యాండ్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది. రూ.15 వేల లోపు ధరల విభాగంలో దేశంలో ఈ స్థాయి మోడల్‌ ఇదొక్కటేనని కంపెనీ తెలిపింది.

భారత్‌లో తొలిసారిగా క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్లస్‌ 5జీ ప్రాసెసర్‌తో తయారైంది. 120 హెట్జ్‌ 6.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, బిజినెస్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ సొల్యూషన్‌ థింక్‌షీల్డ్, 50 ఎంపీ క్వాడ్‌ కెమెరా, 20 వాట్‌ టర్బోపవర్‌ చార్జర్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్‌ కోసం 4జీ4 మిమో, 3 క్యారియర్‌ అగ్రిగేషన్‌ సాంకేతికత జోడించారు. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్‌ 16 నుంచి లభిస్తుంది.  

చదవండి:ఐఫోన్‌ 13 ఉచితం ! ఎక్కడ? ఎప్పుడు? ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement