MedPlus announces 50-80% discount on over 500 medicines under its own brand - Sakshi
Sakshi News home page

ఇక మెడ్‌ప్లస్‌ సొంత బ్రాండ్‌ మందులు.. 80 శాతం వరకు డిస్కౌంట్‌!

Published Thu, Jun 22 2023 8:41 AM | Last Updated on Thu, Jun 22 2023 9:15 AM

MedPlus announces 50 to 80 pc discount on over 500 medicines under its own brand - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధాల విక్రయంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌.. సొంత బ్రాండ్‌లో మందుల అమ్మకాల్లోకి ప్రవేశించింది. 50–80% డిస్కౌంట్‌తో వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్‌ రెడ్డి తెలిపారు.

కంపెనీ సీవోవో చెరుకుపల్లి భాస్కర్‌ రెడ్డి, చీఫ్‌ స్ట్రాటజిక్‌ ఆఫీసర్‌ చేతన్‌ దీక్షిత్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివిధ చికిత్సలు, దీర్ఘకాలిక జబ్బులకువాడే 500లకుపైగా పేటెంట్‌యేతర ఔషధాలను మెడ్‌ప్లస్‌ బ్రాండ్‌లో ప్రవేశపెట్టినట్టు మధుకర్‌ చెప్పారు. జీఎంపీ, ఈయూ జీఎంపీ ధ్రువీకరణ పొందిన ప్లాంట్లలో మందులు తయారవుతున్నట్టు వివరించారు.  

ఏటా 1,000 స్టోర్లు.. 
ప్రతి ఏటా మెడ్‌ప్లస్‌ ఫార్మసీ విభాగంలో 1,000 రిటైల్‌ ఔట్‌లెట్లను తెరుస్తామని మధుకర్‌ రెడ్డి తెలిపారు. ‘వీటి ఏర్పాటుకు ఏటా సుమారు రూ.300 కోట్లు అవసరం అవుతాయి. ఏడు రాష్ట్రాల్లోని 552 నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 3,822 స్టోర్లు ఉన్నా యి. ఈ ఏడాదే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రా ష్ట్రాల్లో అడుగుపెడుతున్నాం. 2022–23లో రూ. 4,550 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25% వృద్ధి ఆశిస్తున్నాం. డిస్కౌంట్ల వల్ల లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు’ అని వెల్లడించారు. సంస్థకు 22 వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement