పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు Link Pan With Aadhaar By May 31 To Avoid Higher Tds | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు

Published Tue, May 28 2024 3:53 PM | Last Updated on Tue, May 28 2024 4:01 PM

Link Pan With Aadhaar By May 31 To Avoid Higher Tds

ట్యాక్స్‌ పేయర్స్‌ను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలెర్ట్‌ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్‌ ట్యాక్స్‌ డిడక్ట్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు.  

పాన్‌కు ఆధార్‌ లింక్‌ చేయకపోతే 
నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్‌ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement