LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌! | LIC Jeevan Dhara II policy launched | Sakshi
Sakshi News home page

LIC Jeevan Dhara II Policy: ఎల్‌ఐసీ 'జీవన్​ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్‌ఫిట్స్‌!

Published Sun, Jan 21 2024 1:42 PM | Last Updated on Sun, Jan 21 2024 2:57 PM

LIC Jeevan Dhara II policy launched - Sakshi

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్​ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్‌ అందుబాటులోకి రానుంది.  

ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది.   అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్‌ ఇన్‌ కమ్‌ పొందవచ్చు. 

జీవన్ ధార 2 పథకం వివరాలు 

పాలసీ కట్టే సమయంలో  లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది. 

ఒకేసారి డిపాజిట్‌ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు.   

యాన్యుటైజేషన్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది.

తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. 

రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు,

సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు,

యాన్యుటీ టాప్​-అప్​ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ ఎల్​ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్​ తీసుకోవచ్చు.

పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement