టాటా స్టీల్ కీలక నిర్ణయం.. 2500 ఉద్యోగాల కోత Tata Steel's move to low-emission electric arc furnace in the UK will cut around 2500 jobs. Sakshi
Sakshi News home page

టాటా స్టీల్ కీలక నిర్ణయం.. 2500 ఉద్యోగాల కోత

Published Sun, Jun 2 2024 7:07 PM | Last Updated on Mon, Jun 3 2024 12:16 PM

Job Cuts in UK Tata Steel

గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో యూకేలోని టాటా స్టీల్ తన సిబ్బందిలో 2500 మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.

యూకే టాటా స్టీల్ సంస్థలో ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖిస్తూ.. నిరసనలు కూడా తెలియజేస్తున్నాయి. యూకే ప్రభుత్వం సాయంతో డీకార్బనైజేషన్ ప్లాన్‌లో భాగంగా.. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ప్రక్రియకు మారుతోంది. కాబట్టి రాబోయే మూడేళ్ళలో కర్బన ఆధారిత తయారీ పూర్తిగా నిలిపిఈవేస్తున్నట్లు సమాచారం.

టాటా స్టీల్ సంస్థ యూకేలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను పెంచనుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా కీర్తి గడించింది. ఇక్కడ సుమారు 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే కంపెనీ ఏడాదికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 2500 మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 2023లో టాటా స్టీల్ అండ్ యూకే ప్రభుత్వం బ్రిటన్‌లోని పోర్ట్ టాల్బోట్ స్టీల్ తయారీ సదుపాయంలో డీకార్బనైజేషన్ ప్లాన్‌లను అమలు చేయడానికి 1.25 బిలియన్ పౌండ్ల ఉమ్మడి పెట్టుబడి ప్రణాళికపై అంగీకరించాయి. ఇందులో 500 మిలియన్ పౌండ్లు యూకే ప్రభుత్వం అందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement