Infinix InBook Y1 Plus Neo launched in India; check price details - Sakshi
Sakshi News home page

Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్‌, ఎట్రాక్టివ్‌ ఫీచర్స్‌!

Published Thu, Apr 20 2023 5:38 PM | Last Updated on Thu, Apr 20 2023 5:57 PM

Infinix INBook Y1 Plus Neo Launched In India with budget price - Sakshi

సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్‌ ఇపుడిక ల్యాప్‌టాప్ విభాగంలో క్రమంగా  విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి  సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్‍బుక్ వై1 ప్లస్ నియో  పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్‌ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్‍హెచ్‍డీ డిస్‍ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్‍కోర్  ప్రాసెసర్‌ లాంటి  ఫీచర్లను  ఇన్ఫినిక్స్ ఇన్‍బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్‍టాప్ ఫస్ట్ సేల్‍లో లాంచింగ్‌ ధరను ఆఫర్‌ చేస్తోంది.  (బీ అలర్ట్‌: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?)

ఇన్ఫినిక్స్‌ ఇన్‍బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు
15.6 అంగుళాల ఫుల్‍హెచ్‍డీ డిస్‍ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్‍కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఇంటెల్ యూహెచ్‍డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్‍బీ పోర్టులు, ఓ హెచ్‍డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‍బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్‍డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్‌,బ్యాక్‍లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్‌ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది.  ఈ ల్యాప్‍టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది.  (layoffs: షాకిచ్చిన ఇండియన్‌ ట్విటర్‌, 30 శాతం మందికి గుడ్‌ బై?)

2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‍డీ వెబ్‍క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు,  40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్  వెల్లడించింది.  ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్‍టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది.

ఇన్ఫినిక్స్ ఇన్‍బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్
 8 జీబీ  ర్యామ్,  256 జీబీఎస్‌ఎస్‌డీ స్టోరేజ్  వేరియంట్‌ ఇన్ఫినిక్స్ ఇన్‍బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్‍టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ  ర్యామ్, 512జీబీ  ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ ద్వారా  ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్‍లలో లభ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement