భవిష్యత్తులో కరెంట్‌ కష్టాలు తీరేనా..? | Indian Govt Seeks 26 Billion USD Nuclear Power Investments | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో కరెంట్‌ కష్టాలు తీరేనా..?

Published Sat, Feb 24 2024 1:10 PM | Last Updated on Sat, Feb 24 2024 1:29 PM

Indian Govt Seeks 26 Billion USD Nuclear Power Investments - Sakshi

అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్‌ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్‌ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్‌ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్‌ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్‌  తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్‌కే పెద్దపీట వేస్తున్నారు. 

అణు విద్యుత్‌ రంగంలో 26.50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్‌ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్‌ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ప్రముఖ కంపెనీలతో చర్చలు

అణు విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పవర్‌, వేదాంతా, టాటా పవర్‌లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్‌ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది.

1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం..

ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎన్‌పీసీఐఎల్‌ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్‌ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement