మేడిన్‌ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు | India Set To Become A Leader In Global Mobile Phone Market - Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు

Published Thu, Apr 13 2023 4:38 AM | Last Updated on Thu, Apr 13 2023 10:41 AM

India set to become a leader in global mobile phone market - Sakshi

న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్‌ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపింది. శామ్‌సంగ్‌ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ రెండింతలయ్యాయి.

భారత్‌ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్‌ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్‌ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ తెలిపారు. భారత్‌ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్స్‌ వాటా 46 శాతంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement