India Post Payments Bank Cuts Savings Account Interest Rate by 25 Bps - Sakshi
Sakshi News home page

పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులకు షాక్..!

Published Wed, Feb 2 2022 3:11 PM | Last Updated on Wed, Feb 2 2022 4:04 PM

India Post Payments Bank Cuts Savings Account Interest Rate By 25 Bps - Sakshi

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై చెల్లించే ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీపీబీ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభించనుంది.

గతంలో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ గత నెలలో 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది.

(చదవండి: ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. అదుర్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement