ఫెస్టివ్‌ బొనాంజా: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు, ఐఫోన్‌ 15పై స్పెషల్‌ ఆఫర్‌ ICICI Bank Festive Bonanza Massive discouts Special offers check details | Sakshi
Sakshi News home page

ఫెస్టివ్‌ బొనాంజా: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు, ఐఫోన్‌ 15పై స్పెషల్‌ ఆఫర్‌

Published Thu, Oct 5 2023 4:44 PM | Last Updated on Thu, Oct 5 2023 7:14 PM

ICICI Bank Festive Bonanza Massive discouts Special offers check details - Sakshi

దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్‌లకు అద్భుతమైన ఆఫర్‌లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌ 15 పై ప్రత్యేక ఆఫర్‌ కూడా అందిస్తోంది.  అంతేకాదు  గృహ రుణాలు, వాహన రుణాలు  ద్విచక్ర వాహన రుణాలపై  త్వరలోనే గుడ్‌ న్యూస్‌ను అందించనున్నట్టు  తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI , కార్డ్‌లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్‌లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI  ప్రత్యేక ఆఫర్‌  అందిస్తోంది. (రికార్డ్‌ సేల్స్‌: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు)

కస్టమర్లకు  అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో  ప్రముఖ బ్రాండ్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు),  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్  కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్‌, ఫోర్‌వీలర్‌ వాహన  రుణాలపై  ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు.

(కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్‌ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్‌!)

దీని ప్రకారం యాపిల్‌ ఐఫోన్‌ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు  అందుబాటులో ఉంటాయి. మేక్‌మైట్రిప్, టాటా న్యూ, వన్‌ప్లస్, హెచ్‌పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్‌జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్‌తో డీల్‌ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్‌కు  జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement