ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసిన ‍ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే.. Hyundai Motor Install Ultra High Speed EV Charging Points | Sakshi
Sakshi News home page

ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసిన ‍ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే..

Published Fri, Feb 16 2024 10:14 AM | Last Updated on Fri, Feb 16 2024 10:26 AM

Hyundai Motor Install Ultra High Speed EV Charging Points - Sakshi

విద్యుత్‌ వాహనాల వినియోగదారులు ఛార్జింగ్‌ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ అల్ట్రా-ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా ఫాస్ట్‌ పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ప్రారంభించింది. 

హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్‌, గురుగావ్‌, బెంగళూరులో ఈ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీ-ఛండీగఢ్‌, దిల్లీ-జైపూర్‌, హైదరాబాద్‌-విజయవాడ, ముంబై-సూరత్‌, ముంబై-నాసిక్‌ రోడ్లపై ఐదు అల్ట్రా ఫాస్ట్‌ డీసీ ఛార్జింగ్‌ స్టేషన్లను నెలకొల్పింది.

ఈ ఛార్జింగ్‌ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు ఛార్జింగ్‌ పాయింట్లు ఉంటాయిని చెప్పింది. హ్యుందాయ్‌ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఛార్జింగ్‌ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్‌డ్రైవ్‌ చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి: డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్‌’.. ఎక్కడో తెలుసా..

కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్‌ అవుతుండడంతో సమయం ఆదాకానుందని పేర్కొంది. 30 కిలోవాట్ల ఛార్జర్‌ ఒక్కో యూనిట్‌పై రూ.18, 60 కిలోవాట్ల ఛార్జర్‌ యూనిట్‌పై రూ.21, 150 కిలోవాట్ల ఛార్జర్‌ యూనిట్‌కు రూ.24 ధర నిర్ణయించారు. ఛార్జింగ్‌ స్లాట్‌ను ముందస్తు బుకింగ్‌తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ఏడాదిలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement