ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు! | Hexaware Tech to expand its workforce globally by hiring arround 8,000 employees | Sakshi
Sakshi News home page

ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!

Published Wed, Jul 3 2024 11:54 AM | Last Updated on Wed, Jul 3 2024 12:14 PM

Hexaware Tech to expand its workforce globally by hiring arround 8,000 employees

ప్రముఖ ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ 2024లో సుమారు 6000 నుంచి 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కంపెనీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించడానికి కంపెనీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇండియా, యూఎస్, కెనడా, మెక్సికో, యూకేతో సహా వివిధ దేశాలలో 2024లో 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. భారత్‌లో హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించాం. టెక్ లీడ్స్, ఆటోమేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్ డేటా లీడ్స్, వర్క్‌డే ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.

‘నగరాల వారీగా నిర్దిష్ట నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, నోయిడా కార్యాలయాల్లో ఐసీఎస్‌ఎం, హెచ్‌ఆర్‌ఎస్‌డీ, ఫ్రంట్‌ఎండ్‌, ఎంఎస్‌డీ, జావా ఎఫ్‌ఎస్‌డీ, డాట్‌నెట్‌ ఎఫ్‌ఎస్‌డీ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తాం. కోయంబత్తూర్, బెంగళూరులో అజూర్ డేటాబ్రిక్స్, పైథాన్ ఏడీఎఫ్‌ వంటి టెక్నాలజీ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తాం. యూఎస్‌లో ఆటోమేషన్ నైపుణ్యం కలిగిన క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్‌లు అవసరం. జావా ఫుల్-స్టాక్ ఇంజినీర్లు, టెస్ట్ అనలిస్ట్‌లు (ఎస్‌డీఈటీ), సీనియర్ జావా ఫుల్-స్టాక్ డెవలపర్‌లను నియమించాలని యోచిస్తున్నాం. యూకేలో టెస్ట్ మేనేజర్‌లను (మాన్యువల్‌, ఆటోమేషన్), డెవొప్స్‌​(అజూర్), సర్వీస్ డెస్క్ ప్రొఫెషనల్స్, ఫుల్-స్టాక్ డెవలపర్‌లకు (జావా, డాట్‌నెట్‌) అవకాశం ఇస్తాం’ అని బాలసుబ్రమణియన్ తెలిపారు.

ఇదీ చదవండి: ఫోన్‌ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు

అంతర్జాతీయంగా ప్రముఖ ఐటీ సంస్థలు కాస్ట్‌కటింగ్‌ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పిస్తుండడం మంచి పరిణామమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్‌ రానున్న సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఐటీ రంగం ఊపందుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement