Gold rate today: బంగారం ధర తగ్గుముఖం.. | Gold, Silver Price Today, October 5, 2023: Check Latest Rates Here - Sakshi
Sakshi News home page

Gold rate today: బంగారం ధర తగ్గుముఖం..

Published Thu, Oct 5 2023 11:34 AM | Last Updated on Thu, Oct 5 2023 11:49 AM

Gold rate today slight down 05 october 2023 - Sakshi

Gold price today: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈరోజు (అక్టోబర్‌ 5) బంగారం ధరలు కాస్త తగ్గాయి. గతకొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటోంది. కాగా ప్రస్తుతం బంగారం ధర సుమారు రూ.200 తగ్గి వినియోగదారులకు కాస్త ఊరట కలిగించింది.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. 

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.190 తగ్గి రూ. 52,400 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.200 చొప్పున తగ్గి రూ.57,160 లకు దిగొచ్చింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

పెరిగిన వెండి ధర
Silver rates today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధర కేజీకి రూ.400  మేర పెరిగింది. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ. 73,500లుగా ఉంది. క్రితం రోజు ఇది రూ.73,100 గా ఉండేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement