అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం! Gold Price Today On Akshaya Tritiya [May 10, 2024] | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!

Published Fri, May 10 2024 12:35 PM | Last Updated on Fri, May 10 2024 12:43 PM

Gold Price Today On Akshaya Tritiya [May 10, 2024]

నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.

హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.

ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..
➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. 
➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.
➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 ల​కు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. 

➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.

వెండి కూడా భారీగా..
అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement