గ్రీస్‌లో జీఎంఆర్‌ మరిన్ని పెట్టుబడులు | GMR Group eyes developing Kalamata Airport in Greece | Sakshi
Sakshi News home page

గ్రీస్‌లో జీఎంఆర్‌ మరిన్ని పెట్టుబడులు

Published Sat, Sep 2 2023 4:50 AM | Last Updated on Sat, Sep 2 2023 4:50 AM

GMR Group eyes developing Kalamata Airport in Greece - Sakshi

ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్‌ గ్రూప్‌.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ తెలిపింది.

హెరాక్లియోన్‌ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపార విభాగం చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్‌ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్‌ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement