పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు... FPIs pour 57300-crore in equities in December | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు...

Published Mon, Dec 25 2023 4:40 AM | Last Updated on Mon, Dec 25 2023 4:40 AM

FPIs pour 57300-crore in equities in December - Sakshi

విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి.

అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్‌ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ కుమార్‌ తెలిపారు.

ఈ ఏడాదిలో మొత్తంగా భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్‌ మార్కెట్లోకి డిసెంబర్‌ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్‌ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement