Flipkart Acquires Electronics Recommerce Firm Yaantra - Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనేవారికి గుడ్‌న్యూస్‌..! డిస్కౌంట్స్‌తో పాటుగా ఇవి కూడా..!

Published Thu, Jan 13 2022 7:58 PM | Last Updated on Thu, Jan 13 2022 8:14 PM

Flipkart Acquires Electronics Recommerce Firm Yaantra - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రీకామర్స్‌ వ్యాపారంపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ రీకామర్స్‌ సంస్థ యంత్రను కైవసం చేసుకుంది. యంత్రను కొనుగోలుచేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ జనవరి 13 న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డీల్‌ విలువను ఫ్లిప్‌కార్ట్‌ బహిర్గతం చేయలేదు. 

సమస్యలుంటే ఇకపై సులువు..!
ఈ కొనుగోలుతో ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌, ఇతర గాడ్జెట్స్‌ కొనేవారికి ఎంతగానో ఉపయోగపడునుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని కొనుగోలుచేసిన ఆయా స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా రిపేరింగ్‌ సమస్యలు తలెత్తితే యంత్ర ద్వారా సులువుగా పరిష్కారం కానుంది. దాంతో పాటుగా సదరు కస్టమర్‌ స్మార్ట్‌ఫోన్‌ను యంత్రలో అమ్మేయడంతో మంచి డీల్‌ను అందించనుంది.

రీకామర్స్‌లో యంత్ర ఫేమస్‌..!
సెకండ్‌హ్యండ్‌ ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌, స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో, ఆయా గాడ్జెట్స్‌ రిపేరింగ్‌ సర్వీసులను యంత్ర అందిస్తోంది. 2013లో జయంత్ ఝా, అంకిత్ సరాఫ్, అన్మోల్ గుప్తా యంత్రను స్ధాపించారు. సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌ట్యాప్‌, స్మార్ట్‌ఫోన్స్‌ లాంటి సాంకేతిక ఉత్పత్తులను రిపేర్‌ చేసి విక్రయిస్తోంది. రిఫర్‌బ్రిష్డ్‌ అమ్మకాల్లో యంత్ర భారీ ఆదరణను పొందింది.

చదవండి: స్విగ్గీ డెలివరీలు సరికొత్తగా..! ప్రణాళికలు సిద్ధం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement