వైజాగ్‌ స్టీల్‌ విక్రయానికి సలహా సంస్థల క్యూ | Five Firms In Race To Be Transaction Advisors In Vizag Steel | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌ విక్రయానికి సలహా సంస్థల క్యూ

Published Sat, Sep 25 2021 3:45 AM | Last Updated on Sat, Sep 25 2021 3:45 AM

Five Firms In Race To Be Transaction Advisors In Vizag Steel  - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్‌ఐఎన్‌ఎల్‌(వైజాగ్‌ స్టీల్‌)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్‌ చేసినట్లు దీపమ్‌ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌సహా ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, డెలాయిట్‌ టచ్‌ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్‌బీఎస్‌ఏ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ చేరినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్‌ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్‌ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్‌ స్టీల్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్‌ బిడ్స్‌ను ఆహా్వనించింది.

ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్‌ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్‌ ఒకే అడ్వయిజర్‌ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్‌ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్‌ అండ్‌ మహాజన్, ఎకనమిక్‌ లాస్‌ ప్రాక్టీస్, జే సాగర్‌ అసోసియేట్స్, కొచ్చర్‌ అండ్‌ కంపెనీ, లింక్‌ లీగల్‌ ఉన్నాయి.

జనవరిలోనే..
ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(వైజాగ్‌ స్టీల్‌)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్‌ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్‌ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement