డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ! | FD Interest Rate These banks are offering good interest on FD | Sakshi
Sakshi News home page

డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!

Published Sat, Feb 24 2024 6:34 PM | Last Updated on Sat, Feb 24 2024 7:01 PM

FD Interest Rate These banks are offering good interest on FD - Sakshi

FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB):
పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్‌డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్‌ ఎఫ్‌డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్‌డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి  7.05 శాతానికి  పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది.

ఐడీబీఐ బ్యాంక్ (IDBI):
ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్‌డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్‌ ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ కస్టమర్‌లకు 3 శాతం నుంచి  7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB):
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్‌డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్‌డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం..  7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్‌ ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది.

ఫెడరల్ బ్యాంక్ :
ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.

గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్‌ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement