EPFO adds 17.2 lakh members in April, over half of them are aged 18-25 years - Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!

Published Thu, Jun 22 2023 7:52 AM | Last Updated on Thu, Jun 22 2023 9:55 AM

EPFO adds 17 lakh members in April over half aged 18 to 25 years - Sakshi

న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ–  ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నికరంగా 17.20 లక్షల మంది సభ్యులు చేరారు. చేరిన మొత్తం ఈ సభ్యుల్లో కొత్త సభ్యుల సంఖ్య 8.47 లక్షలు.  ఈ మేరకు విడుదలైన పేరోల్‌ డేటా ప్రకారం.. 

  • 8.47 లక్షల మంది కొత్త సభ్యుల్లో  54.15 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో మెజారిటీ సభ్యులకు సంఘటిత రంగంలో స్థానం లభించిందన్నమాట. 
  • మొత్తం 17.20 లక్షల మందిని తీసుకుంటే, 2023 మార్చితో పోల్చితే (13.40 లక్షల మంది) వీరి సంఖ్య పెరిగింది.  

ఇక ఏప్రిల్‌లో రీజాయినర్స్‌  

  • ఎన్‌రోల్‌ అయిన నికర మహిళా సభ్యుల సంఖ్య ఏప్రిల్‌లో 3.48 లక్షలుకాగా, మార్చిలో వీరి సంఖ్య 2.57 లక్షలు. కొత్త సభ్యులను మాత్రమే తీసుకుంటే 8.47 లక్షల మందిలో 2.25 లక్షల మంది మహిళలు.  
  • ఏప్రిల్‌లో చేరిన నికర సభ్యుల్లో మెజారిటీ (59.20 శాతం మంది) వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకు చెందినవారు ఉన్నారు.  
  • తయారీ, ఐటీ సంబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  తరువాతి స్థానాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్‌ ఇంజనీరింగ్, వాణిజ్య సంబంధ సంస్థలు, దుస్తులు, నిర్మాణం, ఎగుమతుల సేవా రంగాలు ఉన్నాయి.  

7 కోట్లకుపైగా సభ్యత్వం.. 
ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ.  ఈ ప్రాతిపదికన పేరోల్‌ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్‌ 2018 నుండి  (సెప్టెంబర్‌ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్‌ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్‌ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ.

ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్‌ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్,  బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓ దాదాపు 7 కోట్ల  మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది.  పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది.  ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్‌ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది.  

డెట్‌ ఇన్వెస్ట్మెంట్‌ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్‌ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్‌ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు,  ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!)

ఈఎస్‌ఐసీ కిందకు కొత్తగా 17.88 లక్షల మంది ఏప్రిల్‌ నెలలో చేరిక 
ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) కిందకు ఏప్రిల్‌ నెలలో కొత్తగా 17.88 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈఎస్‌ఐ అనే సామాజిక భద్రతా బీమా పథకాన్ని ఈఎస్‌ఐసీ నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ కింద 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈఎస్‌ఐసీ కింద కొత్తగా 30,249 సంస్థలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. (ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు)

ఏప్రిల్‌లో కొత్తగా 17.88 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 8.37 లక్షల మంది సభ్యులు 25 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. నికరంగా 3.53 లక్షల మంది మహిళా సభ్యులున్నట్టు తెలిపింది. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ నుంచి 63 మంది సభ్యులుగా చేరారు.

మరిన్ని బిజినెస్‌ వార్తలు, అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షిబిజినెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement