CMIE: Employment Rate Increasing In July After Fall In June - Sakshi
Sakshi News home page

CMIE: జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన  

Published Sat, Jul 16 2022 11:38 AM | Last Updated on Sat, Jul 16 2022 12:15 PM

Employment Rate Increasing In July After Fall In June: CMIE - Sakshi

కోల్‌కతా: ఈ ఏడాది జూన్‌ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది.

ఈ ఏడాది జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్‌ సర్కార్‌ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement