పిల్లల తల్లిదండ్రులకు వార్నింగ్‌ ఇచ్చిన మస్క్‌ elon musk expressed significant concerns about the impact of social media on children | Sakshi
Sakshi News home page

పిల్లల తల్లిదండ్రులకు వార్నింగ్‌ ఇచ్చిన మస్క్‌

Published Sat, May 25 2024 12:43 PM | Last Updated on Sat, May 25 2024 1:16 PM

elon musk expressed significant concerns about the impact of social media on children

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండడం పట్ల టెస్లా సీఈఓ ఎలొన్‌మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్‌లోని వివాటెక్ ఫెయిర్‌లో ఆయన​ పాల్గొని మాట్లాడారు. ఏఐ అల్గారిథమ్‌ల ద్వారా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించారు. సోషల్‌ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పిల్లలను సోషల్‌ మీడియాకు బానిస అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. వాటిలోవాడే అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తాయి. అవి చిన్నారుల్లో డొపమైన్‌ స్థాయిలను పెంచేలా ఉంటాయి. దాంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏఐ ఆధారిత కంటెంట్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో నా పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించకపోవడం తప్పుగా భావిస్తున్నాను. ప్రస్తుతం కొన్ని పరిమితులు విధించాను. పిల్లలు ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారో గమనిస్తున్నాను’ అని చెప్పారు.

ఎలొనమస్క్‌ ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో వచ్చే పిల్లల కంటెంట్‌ అంశంపై ఆయన స్పందించారు. చిన్నారుల కంటెంట్‌ విషయంలో తమ సంస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అనవసర అంశాలను తొలగించడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది. పారిస్‌ ఈవెంట్‌లో మస్క్‌ ఏఐ ప్రభావంపై మాట్లాడుతూ..‘కృత్రిమమేథ చివరకు అందరి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తుంది. ఏఐ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో మానవ మనుగడ ఎలా ఉండబోతుందోననే ఆందోళనలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి’ అన్నారు.

ఇదీ చదవండి: ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరత

మస్క్ ఈ సందర్భంగా ఇయాన్ ఎం.బ్యాంక్స్ విడుదల చేసిన ‘కల్చర్ బుక్ సిరీస్’ గురించి ప్రస్తావించారు. ఇది అధునాతన ఏఐ ఉండే సమాజాన్ని తెలియజేస్తుంది. ఈ బుక్‌ సిరీస్‌లో భవిష్యత్తును చూపించారని మస్క్‌ అన్నారు. ‘కంప్యూటర్లు, రోబోట్‌లు ప్రతిదీ మీ కంటే మెరుగ్గా చేస్తే మీ జీవితానికి అర్థం ఉందా? ఇకపై ఏఐను మించేలా మానవులు మరిన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement