హాలోవీన్ వేషదారణలో ఎలాన్‌ మస్క్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నారో! Elon Musk Dressed As Santa Claus When He Was Five Years Old | Sakshi
Sakshi News home page

హాలోవీన్ వేషదారణలో ఎలాన్‌ మస్క్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!

Published Wed, Nov 1 2023 8:04 PM | Last Updated on Wed, Nov 1 2023 8:29 PM

Elon Musk Dressed As Santa Claus When He Was Five Years Old - Sakshi

హాలోవీన్.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ జరుపుకుంటారు. మనం కలిపూజ ముందు రోజు భూత్ చతుర్దశిని జరుపుకున్నట్లే, పాశ్చాత్య దేశాలలో హాలోవీన్ జరుపుకుంటారు. 

తాజాగా హాలోవీన్‌ సందర్భంగా ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఓ క్యూట్‌ ఫొటోను షేర్‌ చేశారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్‌ డ్రెస్‌ ధరించిన ఫొటోను మస్క్‌ పోస్టు చేశారు. ఈ మేరకు అందరికీ హాలోవీన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

అధిక సంతానంపై మస్క్ ఏమన్నారంటే?
అంతకుముందు, హంగరీ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్..‘సంతానం లేనివారితో పోలిస్తే పిల్లలున్నవారికి ఆర్థికంగా ప్రతికూలతలు ఉండాలా? హంగరీలో సంతానం ఉన్నవారు ఆర్థికంగా సానుకూలతలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌పై మస్క్‌ స్పందించారు. 

తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. కానీ అది కరెక్ట్‌ కాదు. జనాభా రెట్టింపైనా పర్యావరణం బాగానే ఉంటుంది. సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొన్ని దేశాల్లో మాదిరిగా వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. మనం తప్పక తర్వాతి తరాన్ని సృష్టించాలి. లేకపోతే అస్థిత్వాన్ని కోల్పోయే స్థితిలోకి జారుకుంటాం’ అని మస్క్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement