అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. | Educational backgrounds of Mukesh Ambani's daughters-in-law and son-in-law | Sakshi
Sakshi News home page

అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా..

Published Mon, Feb 19 2024 9:05 AM | Last Updated on Mon, Feb 19 2024 10:26 AM

Educational Backgrounds of Mukesh Ambani Daughters In Law And Son In Law - Sakshi

త్వరలో ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో మరో వ్యక్తి చేరనున్నారు. నీతా అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ' రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఓ అడుగు ముందుకు వేయనుంది. అయితే ఈ కథనంలో అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం.

ఆనంద్ పిరమల్
అజయ్ పిరమల్ & డాక్టర్ స్వాతి పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్ 'పిరమల్ గ్రూప్‌' బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన బోస్టన్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

శ్లోకా మెహతా
రస్సెల్ మెహతా, మోనా మెహతా కుమార్తె శ్లోకా మెహతా రోజీ బ్లూ ఇండియా కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా & న్యూజెర్సీలోని ఐవీ లీగ్ సంస్థ అయిన ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

రాధిక మర్చంట్ 
వీరేన్ మర్చంట్ & శైలా మర్చంట్ కుమార్తె  రాధికా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్ బోర్డులో ఒకరుగా ఉన్నారు. ఈమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement