ఎల్రక్టానిక్స్‌ తయారీ 4 రెట్లు అప్‌.. Domestic electronics manufacturing up 4-fold to Rs8. 22 lakh cr | Sakshi
Sakshi News home page

ఎల్రక్టానిక్స్‌ తయారీ 4 రెట్లు అప్‌..

Published Thu, Dec 7 2023 6:29 AM | Last Updated on Thu, Dec 7 2023 6:29 AM

Domestic electronics manufacturing up 4-fold to Rs8. 22 lakh cr - Sakshi

గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ నాలుగు రెట్లు పెరిగి రూ. 8.22 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌సభలో తెలిపారు. ఇది 2026 నాటికి రూ. 23.95 లక్షల కోట్లకు చేరనుందన్నారు. 2013–14లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రూ. 1.80 లక్షల కోట్లుగా ఉండేదని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం భారత్‌లో ఉపయోగిస్తున్న మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌లో 99.2 శాతం దేశీయంగా తయారైనవే ఉంటున్నాయని ఆయన వివరించారు.  2022–23లో భారత్‌ 11.1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే మొబైల్స్‌ను ఎగుమతి చేసినట్లు చంద్రశేఖర్‌ చెప్పారు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశం స్థాయికి ఎదిగిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement