గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. Domestic Air Traffic Witnesses 4.8% Increase in February | Sakshi
Sakshi News home page

గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా..

Published Sat, Mar 16 2024 2:55 PM | Last Updated on Sat, Mar 16 2024 3:23 PM

Domestic Air Traffic Witnesses 4.8% Increase in February - Sakshi

దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణం చేశారని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. 2023 ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.20 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.8% అధికం. 

ఈ ఏడాది జనవరిలో ప్రయాణించిన 1.31 కోట్ల మందితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. గత నెలలో విమానాల జాప్యం కారణంగా 1.55 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సర్వీసులు రద్దు చేయడంతో 29,143 మంది ప్రయాణికులపై ప్రభావం పడగా, సంస్థలు పరిహారంగా రూ.99.96 లక్షలు చెల్లించాయి.

ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు..!

ఫిబ్రవరిలో ఎయిరిండియా మార్కెట్‌ వాటా 12.2% నుంచి 12.8 శాతానికి పెరగ్గా.. ఇండిగో వాటా 60.2% నుంచి 60.1 శాతానికి, స్పైస్‌జెట్‌ వాటా 5.6% నుంచి 5.2 శాతానికి తగ్గింది. విస్తారా 9.9%, ఆకాశ ఎయిర్‌ 4.5%, ఏఐఎక్స్‌ కనెక్ట్‌ 6.1% వాటాలను పొందాయి. సమయానికి విమానాలు నడపడంలో ఎయిరిండియా 56.4%, స్పైస్‌జెట్‌ 59.1 శాతం పనితనాన్ని సాధించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement