బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ ప్రకటనలకు దూరంగా ఉండండి | Consumer body warns celebrities and influencers against promoting betting, gambling | Sakshi
Sakshi News home page

బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ ప్రకటనలకు దూరంగా ఉండండి

Published Thu, Mar 7 2024 5:05 AM | Last Updated on Thu, Mar 7 2024 5:05 AM

Consumer body warns celebrities and influencers against promoting betting, gambling - Sakshi

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సీసీపీఏ సూచన

న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్‌ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్‌ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది.

చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్‌ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్‌ ముసుగులో పలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది.

ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్‌ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement