ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య | Cholamandalam Co Chairman Vellayan Subbiah Wins EY World Entrepreneur Award, See Details | Sakshi
Sakshi News home page

ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య

Published Sun, Jun 9 2024 7:24 AM | Last Updated on Sun, Jun 9 2024 2:53 PM

Cholamandalam Co chairman Vellayan Subbiah wins EY World Entrepreneur award

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెం​ట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్‌మెం​ట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.

ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.

నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.

ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement