సైబర్‌ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు | BSE, NSE taking steps to mitigate cyber attack risks says Sebi chairperson Madhabi Puri | Sakshi
Sakshi News home page

సైబర్‌ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు

Published Sat, Oct 29 2022 4:46 AM | Last Updated on Sat, Oct 29 2022 8:55 AM

BSE, NSE taking steps to mitigate cyber attack risks says Sebi chairperson Madhabi Puri  - Sakshi

బెంగళూరు: సైబర్‌ దాడులను అధిగమించే వ్యవస్థలను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మార్చి నాటికి కొత్త వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి తెలిపారు. సైబర్‌ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు ఆమె తెలిపారు. సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే చక్కని ప్రణాళికను స్టాక్‌ ఎక్సే్ఛేంజ్‌లు, డిపాజిటరీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

‘‘ఏదో సాధారణ ప్రామాణిక విపత్తు రికవరీ ప్రణాళికలు అన్నవి కేవలం లొకేషన్‌ డౌన్‌టైమ్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్‌ బ్రేక్‌డౌన్‌లనే పరిగణనలోకి తీసుకుంటాయి. సాఫ్ట్‌వేర్‌ బ్రేక్‌డౌన్, సమస్య విస్తరణను కాదు. సైబర్‌ దాడిలో సాఫ్ట్‌వేర్‌పైనే ప్రభావం పడుతుంది. దాంతో విపత్తు రికవరీ సైట్‌ కూడా ప్రభావానికి గురవుతుంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అందుకే దేశంలోని రెండు పెద్ద స్టాక్‌ ఎకేŠస్ఛ్‌ంజ్‌లు అయిన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ తగిన భద్రతా వ్యవస్థలను అమల్లో పెట్టేలా చర్యలను సెబీ తీసుకుంది’’అని మాధవి వివరించారు.

ప్రస్తుతం ఈ పని పురోగతిలో ఉందంటూ, ఇది వచ్చే మార్చి నాటికి పనిచేయడం మొదలు పెడుతుందన్నారు. ‘‘ప్రతిపాదిత యంత్రాంగంలో ప్రతి క్లయింట్‌కు సంబంధించి అన్ని రకాల పొజిషన్లు, తనఖా తదితర వివరాలన్నీ ‘ఏ’ ఎక్సే్ఛేంజ్‌ (ఆన్‌లైన్‌)లో ఉంటాయి. ఈ డేటా అంతా కూడా వెళ్లి ఎక్సే్ఛేంజ్‌ ‘బీ’ లోని స్టోరేజ్‌ బాక్స్‌లో (డేటా సెంటర్‌) ఎప్పటికప్పుడు నిల్వ అవుతుంటుంది. ఒకవేళ ఎక్సే్ఛేంజ్‌ ఏ బ్రేక్‌డౌన్‌ అయితే, అది సాఫ్ట్‌వేర్‌ దాడి (సైబర్‌ దాడి) అని సెబీ నిర్ధారిస్తే.. అప్పుడు ఎక్సేంజ్‌ బీలో డేటా అప్‌లోడ్‌ అయ్యే బటన్‌ను సెబీ ప్రెస్‌ చేస్తుంది’’అని సెబీ చైర్‌పర్సన్‌ వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement