Apple Fan Brings 1984 Macintosh At Apple BKC Mumbai - Sakshi
Sakshi News home page

అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్‌ కుక్‌కు ఇంతకన్నా ఏం కావాలి!

Published Tue, Apr 18 2023 2:07 PM | Last Updated on Tue, Apr 18 2023 2:33 PM

Apple Fan Brings 1984 Macintosh At Apple Bkc Mumbai - Sakshi

ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ ‘యాపిల్‌ బీకేసీ’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ స‍్టోర్‌ను (ఏప్రిల్‌ 18న) యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ స్వయంగా ప్రారంభించారు. 

రిటైల్‌ స్టోర్‌ అందుబాటులోకి రానున్నడంతో స్టోర్‌ను వీక్షించేందుకు, అందులోని ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన యాపిల్‌ అభిమానులు యాపిల్‌ బీకేసీ స్టోర్‌ ఎదుట బారులు తీరారు. చాలా మంది సందర్శకులు స్టీవ్ జాబ్స్ ఇష్టపడేలా టీ-షర్టులను ధరించారు. వారి జుట్టును యాపిల్ లోగో ఆకారంలో కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఓ అభిమాని 1984లో ప్రారంభించిన మొదటి యాపిల్ కంప్యూటర్ వెర్షన్‌ (మాకింతోష్ కంప్యూటర్)ను  తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాపిల్‌ ఉత్పత్తులతో తమకున్న అనుబంధాల్ని, స్మృతులను నెమరేసుకున్నారు. అయితే రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం అనంతరం అభిమానులతో కరచాలనం చేసిన టిమ్‌కుక్‌ సదరు ఫ్యాన్‌ తెచ్చిన కంప్యూటర్‌ను చూసి ‘వావ్‌’ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 

‘నేను తొలిసారి 1984 యాపిల్‌ కంప్యూటర్‌ను కొనుగోలు చేశా. నాటి నుంచి యాపిల్‌ ఉత్పత్తులనే వినియోగిస్తున్నా. తన చేతిలో ఉన్న కంప్యూటర్‌ను చూపిస్తూ ఇదిగో దీని డిస్కోస్టోరేజ్‌ కెపాసిటీ 2 మెగాబైట్స్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో ఉంది. ఇప్పుడు ఇదే కంప్యూటర్‌ను యాపిల్‌ 4కే, 8కే రెసెల్యూషన్‌ డిస్‌ప్లేలను తయారు చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం యాపిల్‌ అభిమాని తన వెంట తీసుకొచ్చిన యాపిల్‌ కంప్యూటర్‌ను టిమ్‌ కుక్‌కు చూపించడం.. ఆ కంప్యూటర్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సినీ హీరో హీరోయిన్లకే కాదు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు అభిమానులుంటారని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.  

చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్‌ అదిరింది’.. యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement