Akasa Air Hikes Pilot Salary By 40 Percent From July - Sakshi
Sakshi News home page

Akasa Air: భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్‌ వేతనాలు.. కెప్టెన్‌ నెల శాలరీ ఎంతంటే?

Published Sun, Jun 25 2023 3:59 PM | Last Updated on Sun, Jun 25 2023 5:29 PM

Akasa Air Hikes Pilot Salary By 40 Percent From July - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు, దివంగత రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్‌..సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు భారీగా పెరిగాయి. మిగిలిన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగోలు పోటీ పడుతూ వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెడుతున్నాయి.  

ఈ క్రమంలో ఆకాశా ఎయిర్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశా ఎయిర్‌లో పెంచిన 40 శాతం శాలరీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. సీనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌ (ఫ్లైట్‌ నడిపేవారు) ఉద్యోగుల జీతం నెలకు రూ.2.75లక్షల నుంచి రూ.3.40 లక్షలకు, సీనియర్‌ కెప్టెన్స్‌ల వేతనం రూ.5.75లక్షల నుంచి రూ.6.25లక్షలకు చేరింది.

ఇక, పైలెట్ల జీతాలు అనుభవంతో పాటు ఎన్ని గంటల పాటు పైలెట్‌ విధులు నిర్వహించారనే ఆధారంగా శాలరీలు చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. కెప్టెన్‌లు నెలకు 60 గంటల ప్రయాణానికి గతంలో రూ.7.28లక్షలు ఉండగా.. తాజాగా నిర్ణయంతో రూ.7.75లక్షలు చేరింది. ప్రస్తుతం, ఉన్న పిక్స్‌డ్‌ పే అవర్స్‌ను 40 గంటల నుంచి 45 గంటలకు పెంచింది. వేతనాల సవరింపుతో ప్రతి అదనపు గంటకు కెప్టెన్ రూ. 7,500, ఫస్ట్‌ ఆఫీసర్‌ రూ. 3,045 పొందనున్నారు.

అంచనా ప్రకారం.. ఆకాశ ఎయిర్‌ 19 విమానాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, పనిగంటల తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఉద్యోగుల నెలవారీ జీతాలపై పడుతుంది. దీంతో పైలట్‌లు ఆశించిన సమయాల్లో విమానాలను నడిపించలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ ఆకాశయిర్‌ వేతనాల్ని 40 శాతంతో జీతాలు భారీగా పెంచింది.

చదవండి👉 మోదీ ‘హై - టెక్‌ హ్యాండ్‌ షేక్‌’.. భారత్‌కు పెట్టుబడుల వరద!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement