రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ | Adani Ports Acquires 95% Stake In Gopalpur Port For About Rs 3000 Cr | Sakshi
Sakshi News home page

మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ

Published Tue, Mar 26 2024 1:04 PM | Last Updated on Tue, Mar 26 2024 1:19 PM

Adani Ports Acquires 95 Percent Of Gopalpur Port About Rs 3050 Crs  - Sakshi

భారత్‌లోని ప్రైవేట్‌ పోర్టులను ఒక్కొక్కటిగా అదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తూ వస్తోంది. కొన్నింటిలో అధిక వాటాలను కలిగి ఉంది. తాజాగా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌(ఏపీసెజ్‌) ఒడిషాలోని గోపాల్‌పూర్‌ పోర్టులో మేజర్‌వాటాను కొనుగోలు చేసినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. 

ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువకు దీన్ని అదానీ గ్రూప్‌నకు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ తెలిపింది. ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్‌ 2017లో కొనుగోలు చేసింది. గోపాల్‌పూర్‌ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. 

గ్రీన్‌ఫీల్డ్‌ ఎల్‌ఎన్‌జీ రీ గ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు ఇటీవలే పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీతో ఈ రేవు ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్‌పీ గ్రూప్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తర్‌ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసి వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్‌ టన్నుల నుంచి ఐదు మిలియన్‌ టన్నులకు పెంచింది.

అప్పులను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్‌పీ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. తద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని తెలిసింది. ఇప్పటికే ముంద్రాపోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకల్‌ పోర్టు, హజిరా పోర్టు, ధామ్రా పోర్టు..వంటి ప్రధాన పోర్టుల్లో అదానీ గ్రూప్‌ గరిష్ఠ వాటాలు కలిగి ఉంది.

ఇదీ చదవండి: మహిళలకు ప్రభుత్వ బ్యాంక్‌ ప్రత్యేక క్రెడిట్‌కార్డులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement