మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే! | 76th independence day 2023 indian origin ceos global firms making india proud | Sakshi
Sakshi News home page

Independenceday 2023: మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఇది అంత ఈజీగా రాలే!

Published Fri, Aug 11 2023 10:28 AM | Last Updated on Tue, Aug 15 2023 9:41 AM

76th independence day 2023 indian origin ceos global firms making india proud - Sakshi

భారత సంతతికిచెందిన టాప్‌ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్‌ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను  చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్  సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న  సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు,  ఆధునిక  టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ  అందరికీ స్ఫూర్తి  దాయకంగా నిలుస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్‌ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు  గ్లోబల్‌ కంపెనీల్లో  కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్​ అండ్​ హాస్​ ఛైర్మన్​, సీఈఓగా రాజ్​ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్‌ర్ట్​ఫోర్డ్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ఛైర్మన్​, సీఈఓగా యూఎస్​ ఎయిర్​వేస్​ గ్రూప్​నకు రాకేశ్​ గంగ్వాల్​ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. 

అజయ్‌పాల్ సింగ్ బంగా  ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ 
అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్‌లో జన్మించారు.  ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశారు.నెస్లే  తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్‌ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు.  అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా పనిచేశారు.   గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.


గీతా గోపీనాథ్
గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్‌లోనికోల్‌కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.  ఐఎంఎఫ్‌లో  చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022),  అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ.

అల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో  సుందర్‌ పిచాయ్‌ 
పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్‌ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్‌లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్,  తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్.   ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్‌లో ఎంఎస్‌ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్  చేశారు. 2015లో గూగుల్  సీఈగా  నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్‌ మాతృ సంస్థ అల్పాబెట్‌ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. 

సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌
హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల.  కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో  ఎంఎస్‌ చేశారు.  సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.  మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్‌ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో
1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో  ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్‌, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్‌రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్  కాన్పూర్‌ ఐఐటీనుంచి  డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు. 

లక్ష్మణ్​ నరసింహన్​ స్టార్​బక్స్​ సీఈఓ
2023 ఏప్రిల్​ 1న స్టార్‌బక్స్‌ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్​ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్​ పుణెలో మెకానికల్​ ఇంజినీరింగ్​ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియా జర్మన్​ అండ్​ ఇంటర్నేషనల్​ స్టడీస్​లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్​టన్​ స్కూల్​ నుంచి ఆయన ఫైనాన్స్‌లో  ఎంబీఏ  పొందారు.

ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల  పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు  సీఈఓగా పనిచేశారు. 

శ్రీకాంత్ దాతర్
భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్‌ 1976-78లో IIMAలో మేనేజ్‌మెంట్‌లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్‌డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్‌ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్‌ స్టాండింగ్‌  ఓవర్‌ ఆల్‌ పెర్‌పామెన్స్‌ అవార్డు'  అందుకున్నారు. ఆతరువాత,  IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు.

డీబీఎస్‌ సీఈవో పీయూష్ గుప్తా 
2009లో ఆసియాలోనే పాపులర్‌బ్యాంకు డీబీఎస్‌గ్రూప్‌ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో  నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు.  

ప్రముఖ కంపెనీల్లోని  మరికొంతమంది భారత సంతతి సీఈవోలు
వివేక్​ శంకరన్​- ఆల్బర్ట్​సన్స్​ అధ్యక్షుడు, సీఈవో
సంజయ్​ మెహ్రోత్రా- మైక్రాన్​ టెక్నాలజీ ప్రెసిడెంట్​,సీఈవో
శాంతను నారాయణ్‌- అడోబ్​ ఐఎన్​సీ ఛైర్మన్​, సీఈవో
సీఎస్​ వెంకట కృష్ణన్​- బార్క్​లేస్​ సీఈవోపునిత్​ రెన్జెన్​- డెల్లాయిట్​ సీఈవో
రేవతి అద్వాతి- ఫ్లెక్స్​ సీఈవో


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement