20న వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | YSRCP Key Meeting On June 20th In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

20న వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Published Wed, Jun 19 2024 5:03 AM | Last Updated on Wed, Jun 19 2024 11:22 AM

Ysrcp Key Meeting On June 20th: Andhra pradesh

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన వాయిదా

సాక్షి,అమరావతి: ఈ నెల 21న అసెంబ్లీ సమా­వేశాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.

ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్ల­మెంట్‌ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్య­ర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశాని­ర్దేశం చేయనున్నారు. అలాగే జూన్‌ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్‌ జగన్‌ వాయిదా వేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement