ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం Untimely rains In Andhra Pradesh Krishna Eluru Some Districts | Sakshi
Sakshi News home page

ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం

Published Tue, May 7 2024 5:31 PM | Last Updated on Tue, May 7 2024 6:28 PM

Untimely rains In Andhra Pradesh Krishna Eluru Some Districts

సాక్షి, విజయవాడ:  ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్‌లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.

కృష్ణా జిల్లాలో అకాల వర్షం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.

కృష్ణాజిల్లా :

  • బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.

  • ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.

  • ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.

  • భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.

ఏలూరు జిల్లా

  • నూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.

  • మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.

  • అకాల వర్షంతో  సేద తీరుతున్న  నూజివీడు ప్రాంత ప్రజలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

  • చింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సం

పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement