పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం పెంపు | Salary hike for Polytechnic contract lecturers | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం పెంపు

Published Wed, Jan 12 2022 4:40 AM | Last Updated on Wed, Jan 12 2022 4:40 AM

Salary hike for Polytechnic contract lecturers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం మెమో జారీ చేశారు. వీరికి సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది.

ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి,  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్‌ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement