ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు | Corona Effect Night curfew until 14th Feb In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP Night Curfew: ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

Published Wed, Feb 2 2022 3:03 AM | Last Updated on Wed, Feb 2 2022 12:06 PM

Corona Effect Night curfew until 14th Feb In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. కరోనా మూడో దశ వ్యాప్తి కట్టడికి గత నెల 18 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే.

వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడిగించారు. 14వ తేదీ వరకు రాత్రి 11 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల దాకా ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005, ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు ఉంటాయి. కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకోవాలని సింఘాల్‌ ఆదేశించారు. 
(చదవండి: చిక్కీ, గుడ్ల సరఫరాపై టీడీపీ అవాకులు చెవాకులు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement