‘సమగ్ర విచారణ జరిపిస్తాం’ Botsa Satyanarayana On issue of Tanuku TDR bonds | Sakshi
Sakshi News home page

‘సమగ్ర విచారణ జరిపిస్తాం’

Published Fri, Mar 18 2022 4:22 AM | Last Updated on Fri, Mar 18 2022 3:09 PM

Botsa Satyanarayana On issue of Tanuku TDR bonds - Sakshi

సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ నిర్ణయం తీసుకున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘10 రోజుల క్రితం తణుకు ఎమ్మెల్యే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపించాం. ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌ కింద బాండ్లు ఇచ్చారని తెలిసింది. రోడ్డు కోసం భూ సేకరణ చేయవచ్చు గానీ పార్కు కోసం చేయడం జీవోకు విరుద్ధమని చెప్పాం. దీనిపై సమగ్ర విచారణ జరిపించి.. మూడు, నాలుగు రోజుల్లో వివరాలు వెల్లడిస్తాం’ అని చెప్పారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడామని.. సోమవారం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement